సీఎం జగన్ ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి విడదల రజిని

by Sathputhe Rajesh |
సీఎం జగన్ ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి విడదల రజిని
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ ఎదుట మంత్రి విడదల రజిని కంటతడి పెట్టుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండలం లింగంగుంట్లో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ఒక సీఎం ఎంత చెయొచ్చో సీఎం జగన్ ఆరోగ్య రంగంలో అంత చేసి చూపించారన్నారు. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా.. అన్యాయానికి ఓటమి తప్పదన్నారు. చంద్రబాబు టీడీపీ ఓటమి తప్పదని తెలిపారు. తన రాజకీయ జీవితం, పదవులు జగన్ పెట్టిన భిక్ష అంటూ భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు. తనకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

Advertisement

Next Story