AP News:రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి

by Jakkula Mamatha |
AP News:రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి
X

దిశ ప్రతినిధి, అనంతపురం: గార్లదిన్నె మండలం తరగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

గార్లదిన్నె మండలం తలగాసిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఘటన జరిగిన తీరును, అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ వెంట అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశులు, సీఐ కౌలుట్లయ్య ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story