AP Politics:వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP Politics:వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు వైఎస్ జగన్ అని దుయ్యబట్టారు. కానీ హింస, హత్యల గురించి జగన్ మాట్లాడుతుంటే రావణాసురుడు రామాయణం చెబుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

గత ఐదేళ్ల కాలంలో ప్రజా పాలన కంటికైన కనిపించలేదని ఫైర్ అయ్యారు. గత వైసీపీ పాలన 144 సెక్షన్ పాలనగా కనిపిస్తోందన్నారు. ఇక హత్యలు చేయడం మళ్లీ టీడీపీ పై నెట్టడం వైసీపీకి అలవాటే అని మంత్రి నిమ్మల అన్నారు. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేయడం, శవ రాజకీయాలు చేయడంలో నేర్పరి అని మండిపడ్డారు. ఈ మధ్య వైఎస్ జగన్ పదేపదే రెడ్ బుక్‌ను కలవరిస్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏ రంగు చూసినా ఎరుపు రంగుగానే కనిపిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed