AP News:కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నిమ్మల

by Jakkula Mamatha |   ( Updated:2024-10-09 07:11:30.0  )
AP News:కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నిమ్మల
X

దిశ,వెబ్‌డెస్క్: తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి, పోలవరం నిర్మాణం అమ్మ అనుగ్రహంతో నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మూల నక్షత్ర పర్వదినమైన బుధవారం సరస్వతీ దేవి అవతారం లో కొలువుదీరిన జగన్మాతను సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.ఎస్.రామారావు, దేవాలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం బహుకరించారు. అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు ప్రభుత్వానికి జగన్మాత అనుగ్రహం ఉండాలని కోరుకున్నానన్నారు.

సామాన్య భక్తులకు జగన్మాత దర్శనంలో ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా దేవాలయంలో దేవదాయ శాఖ, జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని 92 శాతం భక్తులు తమ తమ అభిప్రాయాలను దేవస్థానం నిర్వహించిన ఫీడ్ బ్యాక్‌లో తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లు చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు. భక్తుల కోసం దేవస్థానం, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో బాధ్యతలు నిర్వహిస్తున్నాయని ప్రశంసించారు. క్యూ లైన్లలోని భక్తులకు మంచినీరు, మజ్జిగ, పాలు వంటి ద్రవ పదార్థాలు, అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Advertisement

Next Story