- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీ రాజధానిపై జగన్ వింత వ్యాఖ్యలు.. మంత్రి నారాయణ మండిపాటు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati)పై జగన్ (Jagan)చేస్తున్న వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని మంత్రి నారాయణ(Minister Narayana) విమర్శించారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 63 వేల కోట్లతో అమరావతి నిర్మాణం చేపట్టబోతున్నట్లు నారాయణ పేర్కొన్నారు. పలు సమస్థలకు దాదాపు 1200 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ప్రజలపై భారం పడుతుందని, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 అద్భుతమైన సిటీల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
కాగా 2019-2024లో ఏపీ రాజధాని విషయంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ఏం చేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం పాలన సాగిస్తోంది. దీంతో మళ్లీ రాజధాని పనులు ఉపందుకున్నాయి. గతం కంటే మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మరికొన్ని రోజుల్లో రాజధాని నిర్మాణాలను వేగవంతం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజధానిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతో కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో వైసీపీ నాయకుల పేరు ప్రస్తావన వస్తేనే మండిపడిపోతున్నారు. రాజధానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.