సౌదీలో మరో తెలుగు వ్యక్తి దుర్భర జీవితం.. స్పందించిన మంత్రి లోకేష్

by srinivas |   ( Updated:2024-07-20 15:16:20.0  )
సౌదీలో మరో తెలుగు వ్యక్తి దుర్భర జీవితం.. స్పందించిన మంత్రి లోకేష్
X

దిశ ఏపీ బ్యూరో అమరావతి: సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ వీరేంద్ర కుమార్ అనే యువకుడు ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీరేంద్ర వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు.

Read More..

Breaking: పార్లమెంట్ సమావేశాల వేళ ఎంపీలతో జగన్ కీలక సమావేశం

Advertisement

Next Story