- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh:విద్యార్థుల అస్వస్థత పై మంత్రి లోకేష్ స్పందన
X
దిశ,వెబ్‌డెస్క్:ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గడిచిన మూడు రోజులుగా 800మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యార్థుల అస్వస్థత పై తాజాగా మంత్రి లోకేష్ స్పందించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త ఆందోళనకు గురి చేసిందని తెలిపారు. దీని పై తక్షణమే స్పందించి, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Advertisement
Next Story