Nara Lokesh:మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-13 08:59:37.0  )
Nara Lokesh:మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి (Education Minister) నారా లోకేష్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో(Government School) చదువుతున్న 77 వేల మంది పదో తరగతి విద్యార్థులకు ఊరట కలిగేలా మంత్రి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో CBSE అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు(Students) ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అంతర్గత పరీక్షల(Internal tests) ఫలితాల ఆధారంగా మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర బోర్డు పరీక్షలకు, CBSEలకు తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో CBSE అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సామర్థ్యాలను(capabilities) తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 64 శాతం మంది ఉత్తీర్ణులు(Passes) కాలేదని తెలిపారు. అలాగే 326 పాఠశాలలో ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాలేదు. 556 పాఠశాలల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత శాతం నమోదైంది. 66 పాఠశాలల్లో 26 నుంచి 50 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలు(Results) చూస్తే విద్యార్ధులు CBSE విధానంలో పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులు అయ్యే పరిస్థితి లేదని ఈ విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఈ ఏడాది CBSE విద్యార్థులకు రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story