- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనసేనలో చేరిన MP బాలశౌరి ఒక బఫూన్.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. చంద్రబాబు లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండబోరు అని అన్నారు. కావాలనే కుట్ర పూరితంగా హామీల అమలుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని గుర్తుచేశారు. తమ పార్టీలో టికెట్ కోల్పోయిన బఫూన్స్ వేరే పార్టీలోకి వెళ్లి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఒక బఫూన్ అని సీరియస్ కామెంట్ చేశారు.
ఇప్పుడు బాలశౌరి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ బయటపెడుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలశౌరి ఎవరికైనా నమ్మక ద్రోహం చేయగలడు అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇక రాజకీయాల్లో కనిపించడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మునిగిపోయే నావతో చేతులు కలిపాడని ఎద్దేవా చేశారు. నమ్ముకున్న వాళ్లను పవన్ కల్యాణ్ నట్టేట ముంచుతున్నాడని అన్నారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని పిలుపునిచ్చారు.