- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన తీవ్ర విమర్శలు కురిపించారు. స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. స్కిల్ స్కామ్‌లో రూ.371 కోట్లు కొట్టేశారని, ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పారు. ఇదే కాక మిగిలిన కేసుల్లోనూ చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడలేదని చెప్పారు. కేసులనుంచి తప్పుకునేందుకు చంద్రబాబు కింది కోర్టు నుంచి పైకోర్టు వరకూ వెళ్లారని ఎద్దేవా చేశారు. సీమన్స్ కంపెనీతో చంద్రబాబు అగ్నిమెంట్ చేసుకోలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబును సుప్రీంకోర్టు తీర్పు నిరాశలో పడేసిందని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ వైట్ కాలర్ క్రిమినల్స్ అని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని.. సీఎం జగన్ నాలుగేళ్లుగా అడ్డుపడుతున్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా చంద్రబాబు నియమిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అన్ని పార్టీలు కావాలని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పార్టీని ప్రజలు క్వాష్ చేయనున్నారని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.