- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో జీ 20 మార్ధాన్‌ను ప్రారంభించిన మంత్రి అమర్నాథ్..
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G-20 సదస్సు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇందుకు సూచికగా నగరంలో ఆదివారం జీ20 మార్ధాన్‌ను మంత్రి అమర్నాథ్ లాంచనంగా జండా ఊపి ప్రారంభించారు. జీ-20 సదస్సు నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి విడదల రజిని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రులు, అధికారులతో సదస్సు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సుమారు 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నారని, వారికి కావాల్సిన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సదస్సు నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 46 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులు, 24 కిలోమీటర్ల పెయింటింగ్ పనులు, పది కిలోమీటర్ల ఫుట్ పాత్ నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేసినట్లు తెలిపారు. విశాఖ నగరం దేశంలోనే సుందర నగరంగా నిలుస్తుందని తెలిపారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సదస్సుకు జీ 20 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌కి చెందిన దేశాలు కూడా పాల్గొంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ఈ సదస్సుకు విచ్చేసిన విదేశీ ప్రతినిధులకు రాష్ట్ర సమాచారాన్ని పూర్తిగా అందిస్తామని, పెట్టుబడులకు గల అవకాశాలు గూర్చి తెలియజేస్తామన్నారు.
సదస్సు విజయవంతం చేసేందుకు స్పెషల్ సి ఎస్ వై. శ్రీలక్ష్మి, ఎండి, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, తదితరులు బాధ్యతలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.