- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురువులపై నోరు జారిన ఏపీ మంత్రి ..భగ్గుమంటున్న టీచర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదు. ఈ వృత్తి ఎంతో గొప్పది.విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడే వారే ఉపాధ్యాయుడు. ఇంకా చెప్పాలంటే దేశ భవిష్యత్‌కు పునాదులు వేసేది గురువులే. అందుకే గురువులను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు.సెప్టెంబర్ 5న టీచర్స్ డేను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.అయితే అదే టీచర్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఆదిమూలపు సురేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గూగుల్ వచ్చాక గురువులు లేకున్నా ఏంకాదు అంటూ అదేవేదికపై గురువులను మంత్రి అగౌరవ పరిచారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడాడుతూ... గురువులకి తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులను అవమానపరుస్తున్నారని విరుచుకుపడుతున్నారు.
మంత్రి చేసిన వ్యాఖ్యలివే
ప్రస్తుత ఆధునిక కాలంలో గురువుల పాత్ర తగ్గిపోయిందని మంత్రి ఆదిమూలపు సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువుల స్థానంలో గూగుల్ వచ్చిందని... దీంతో విద్యార్థులకు టీచర్ల అవసరం పెద్దగా లేకుండా పోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులకు తెలియని విషయాలను కూడా గూగుల్ చెబుతుందన్నారు. ముఖ్యఅతిథిగా పిలిచిన మంత్రి తమ ఇజ్జత్ తీయడంతో ఉపాధ్యాయులు నోరెళ్లబెట్టారు. అక్కడితో ఆగిపోలేదు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తోందని... అందులో భాగంగానే ట్యాబ్‌లు అందించడం జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పుకొచ్చారు. బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అధునాతన విద్య అందిస్తోందని ఆదిమూలపు సురేశ్ చెప్పుకొచ్చారు.
గురువులను అవమానించడం తగదు
గురువులకి తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందంటూ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తమ మనోభవాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ... గురువులు కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేశ్ వాఖ్యలు అసంబద్దం, అర్ధ రహితం అని అన్నారు. గురువులకు సన్మానం చేసారో లేదా అవమానం చేశారో మంత్రి తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గురు పూజోత్సవం రోజే, గురువుల సన్మాన సభలో ఉపాధ్యాయులను అవమానించడం తగదన్నారు. ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గూగుల్ చదువులు లేవని...గురువు లే చదువులు చెప్తున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.