- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిచౌంగ్ బీభత్సం...చెట్టుమీదపడి కానిస్టేబుల్ దుర్మరణం
దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ధాటికి ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. కడప - చెన్నై జాతీయ రహదారి భాకరాపేట చెక్ పోస్ట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చెట్టుపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. 2004 బ్యాచ్ కు చెందిన సత్య కుమార్(45) పిసి 226 బెటాలియన్‌లో పోలీసు బ్యాండ్ గ్రూప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం విధులు నిర్వహించేందుకు చెన్నూరు నుంచి బెటాలియన్‌కు బైక్ పై వెళ్తుండగా భాకరాపేట సమీపం వద్దకు రాగానే కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న బైక్ పై చెట్టు విరిగి పడింది. దీంతో తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టు మార్టం నిర్వహించనున్నారు. మృతునికి భార్య కుమారుడు ఉన్నట్లు బెటాలియన్ పోలీసులు వెల్లడించారు.