- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొత్సని కలిసిన ఎస్.కోట ఎమ్మెలే.. ఎదో ఆశించే నాపై ఫిర్యాదులు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్ర రాజకీయాలు రసవంతభరితంగా సాగుతన్నాయి.. మార్పులు చేర్పులతో వేడిక్కిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ లో సాగుతున్న మార్పులు చేర్పులు ఉత్కంఠత రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజక వర్గాలు సిట్టింగ్ ఎమ్మెలే లపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నాయి. మాకు సీఎం జగన్ ఓకే కానీ మా ఎమ్మెలేని మాత్రం మార్చండి సారూ అనే వాళ్ళు కూడా ఉన్నారు. దీనితో వైసీపీ అధినేత మరింత జోరుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే ఈ రోజు విజయనగరం మంత్రి బొత్స నారాయణను శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెలే కడుబండి శ్రీనినివాసరావు కలిసారు. బొత్స ఝన్సీకి విశాఖపట్నం లోక్ సభ టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి తాను వెళ్లినట్లు పేర్కొన్నారు.
ఇక కొందరు నేతలు తనపైన చేస్తున్న తిరుగుబాటు పై ఆయన స్పందించారు. తనపైన వస్తున్న ఫిర్యాదుల్లో వాస్తం లేదన్న ఆయన .. ఫిర్యాదులు చేస్తున్న వారు ఎదో ఆశించే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. వారు కష్టపడి పని చేసేవాళ్ళకే అధిష్టానం టిక్కెట్లు ఇస్తుందని పేర్కొన్నారు. ఇక తనని గెలిపించాలని కో- ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తేలినట్లు పేర్కొన్నారు. అలానే తాను కష్టపడి పని చేస్తున్నాని బొత్స సత్యనారాయణ అన్నారని.. అలానే పని చేసుకుంటూ పో అయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చివరిగా అందరు పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిందే అని.. మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.