Transfers: ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు

by srinivas |
Transfers: ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు
X

దిశ,డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. వచ్చే ఏడాది ఆరంభంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ఎన్నికల సమయానికి ఏపీ ప్రభుత్వం అన్నీ చక్కబెట్టుకుంటుంది. ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉండే వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తోంది. అలాగే పోలీస్‌లను కూడా బదిలీ చేస్తుంది. ఇటీవలే కొందరు ఐపీఎస్ అధికారులతో పాటు డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా మరోసారి 37 డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు పలువురు డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు సైతం కల్పించింది. అడిషనల్ డీఎస్పీగా ప్రమోట్ అయిన డీఎస్పీలు 15 రోజుల్లోగా జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed