- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో మరో సంచలన సర్వే.. ఆ పార్టీదే అధికారం.. ఎన్ని సీట్లంటే..!
దిశ, వెబ్ డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల వేళ పలు సర్వేలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ సాధిస్తుందనే అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ఫలితాలను బయటకు చెబుతున్నాయి. తాజాగా జన్ మత్ పోల్స్ సంస్థ తన రిపోర్టును విడుదల చేసింది. ఈ పోల్‌లో దేశంలో బీజేపీకి ఎదురులేదని మరోసారి రుజువైనట్లు తేలింది. ఈసారి ఎన్నికల్లో 326 నుంచి 328 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తోందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ 43 నుంచి 45 ఎంపీ స్థానాలు గెలుపొందుతుందని తేల్చి చెప్పింది.
ఇక ఏపీలోనూ జన్ మత్ పోల్స్ సంస్థ సర్వే నిర్వహించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ- టీడీపీ కూటమి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని తేల్చింది. అయితే బీజేపీ వల్ల టీడీపీ గ్రాఫ్ భారీగా పడిపోయిందని స్పష్టం చేసింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని అంచనా వేసింది. తద్వారా సీఎం జగన్‌కు ప్రజల నుంచి ఆదరణ భారీగా పెరిగిందని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని తెలిపింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 119 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 49 నుంచి 51 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని తెలిపింది. ఇక ఎంపీ స్థానాల్లో వైసీపీదే పై చేయి అని స్పష్టం చేసింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ 19 నుంచి 20 స్థానాల్లో జెండా ఎగురవేస్తోందని, టీడీపీ 3 నుంచి 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని జన్ మత్ పోల్స్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ సంస్థ చేసిన సర్వే అంచనాలపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.