AP News: వీర ఆరాధనోత్సవాల పుణ్యమా.. నాగులేరుకు మహర్ధశ

by Jakkula Mamatha |   ( Updated:2024-11-16 08:38:38.0  )
AP News: వీర ఆరాధనోత్సవాల పుణ్యమా.. నాగులేరుకు మహర్ధశ
X

దిశ, కారంపూడి: నాలుగు శతాబ్దాల క్రితం ఆనాడు కార్యము పొడిగా పిలువబడిన నేటి పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ నెల 30వ తారీఖు నుంచి ఆరంభం అవబోతున్న వీరుల ఉత్సవాలు, మరలా దర్శనం ఇవ్వబోతున్న పలనాటి వీరుల ఆయుధాలు దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తున్న మరుగు పడని అలనాటి కురుక్షేత్ర యుద్ధం లాంటి యుద్ధమే ,ఈ అమరవీరుల ఉత్సవాలు అని అంటారు. రాయబారము రాజమార్గాలు ఫలించక కారంపూడి నాగులేటి ఒడ్డునే పల్నాటి యుద్ధం జరిగింది. అప్పటి పవిత్ర నాగులేరు అమరవీరుల రక్తంతో ఎరుపు రంగులో పారినట్లుగా చరిత్రకారులు చరిత్ర పుటల్లోకి లిఖించి ఉంచారు. అలాంటి చరిత్ర కలిగిన ఒకప్పటి జీవనది నాగు లేరు ఇప్పుడు నదిలో నీరు లేక చెట్లతో, జమ్ముతో,గడ్డితో నానా వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతూ వున్నది. ప్రస్తుత అపవిత్ర నాగులేరు మరలా తన పవిత్రతను సంతరించుకొని, జీవనది వలె ప్రవహించడానికి ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. తిరునాళ్ళ పుణ్యమా అంటు నాగులేరులో జమ్ము, గడ్డిని జేసీబీ సాయంతో మొత్తం వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఇలా తొలగించడం ద్వారా అటు భక్తులకు ఇటు పట్టణ ప్రజలకు దుర్గంధం నుండీ విముక్తి కలుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన వ్యర్థాలను తొలగింపుకు చర్యలు తీసుకున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులు నాయకులకు ప్రజలు అభినందనలు బహిరంగానే అభినందనలు తెలియజేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed