Kakatiya Mega Textile Park : కాకతీయ టెక్స్‌టైల్ పార్కు భూ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

by Ramesh N |
Kakatiya Mega Textile Park : కాకతీయ టెక్స్‌టైల్ పార్కు భూ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కాకతీయ టెక్స్ టైల్ పార్కు (Kakatiya Mega Textile Park) కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెక్స్‌టైల్ పార్కు భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం (Congress Govt Telangana) నిర్ణయించింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ శనివారం ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు కోసం 2016లో వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల చుట్టుపక్కల గ్రామాల నుంచి దశలవారీగా దాదాపు 1357 ఎకరాలను సేకరించారు. కానీ ఏళ్లు గడిచిన పూర్తి స్థాయిలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కాలేదు. గత ప్రభుత్వం ఇంటికో జాబ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు హామీ ఇచ్చినట్లు భూ నిర్వాసితులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హయంలో తాము భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందిరమ్మ ఇండ్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

Next Story