- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Yuvagalam : లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర.. 18 రోజుల పాటు ప్రజల్లోనే
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్ళి మొదలు కాబోతుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో పాదయాత్రను నిలిపివేసిన లోకేశ్ తిరిగి నవంబర్ 27న ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ ఇవాళ రూట్ మ్యాప్ విడుదల చేసింది. యువగళం యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుందని పేర్కొంది.
18 రోజుల పాటు జరిగే ఈ యాత్రను టీడీపీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. సీబీఎన్ అరెస్టు రోజే లోకేశ్ తన యాత్రను పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఎల్లుండి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని మూడు జిల్లాల్ని కలిపేలా పాదయాత్ర డిజైన్ చేయనున్నట్లు సమాచారం.
జగన్.. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో: లోకేశ్
దోచిన దొంగ సొమ్ముతో వ్యవస్థల్ని ఇంకెంతకాలం మేనేజ్ చేస్తావ్ ఏ1 జగన్.. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టింది. నీ దొంగల ముఠా పని అయిపోయింది. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో! అని ఇవాళ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ విమర్శించారు. జగన్ ఇంకా నీ పనైపోయింది. పదేళ్లు కేసులు మ్యానేజ్ చేసుకున్నావ్ అని విమర్శించారు.