Breaking: నేడు శ్రీశైలానికి నారా లోకేష్..అందుకోసమేనా..?

by Indraja |
Breaking: నేడు శ్రీశైలానికి నారా లోకేష్..అందుకోసమేనా..?
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు శ్రీశైలానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం 9 :30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సుండిపెంట చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక కాన్వాయ్ లో ప్రయాణించి శ్రీశైలం చేరుకోనున్నారు.

ఇక నారా లోకేష్ శ్రీశైలం చేరుకున్న తరువాత మొదటగా సాక్షిగణపతి ఆలయానికి చేరుకొని అక్కడ గణపతిని దర్శించుకుంటారు. ఇక ఆ తరువాత ఉదయం 9 :40 గంటల నుండి 10 : 30 గంటల మధ్య శ్రీశైల మల్లికార్జునిడిని, అమ్మవారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు ఘానా స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా క్షేత్ర పరిధిలో పార్టీ జెండా, సిద్ధం అనే నినాదం తో స్థానిక బస్టాండ్ ఆవరణంలో బుధవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరిగిన తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు శ్రీశైల పర్యటన చేయడంతో ఈ ఘటన ప్రాధాన్యత చేకూరింది.


Advertisement

Next Story

Most Viewed