Cheetah:ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిరుతపులి హల్‌చల్..భయాందోళనలో స్థానికులు

by Jakkula Mamatha |
Cheetah:ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిరుతపులి హల్‌చల్..భయాందోళనలో స్థానికులు
X

దిశ, శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచరించింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల తడి పొడి చెత్త సేకరణ చేసే ప్రహరీ గోడ పై చిరుత పులి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ప్రహరీ గోడ పై కూర్చుని ఉన్న చిరుతపులి చూసి అటుగా వెళ్తున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు చిరుతపులి ప్రహరీ గోడ పై కూర్చొని ఉన్న దృశ్యాలను వారి సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్రం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఒకచోట చిరుత పులి సంచారాన్ని తాము చూసామంటూ స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు చిరుపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుత పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed