- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాషాయపార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చపార్టీకి కాపలానా?: పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. కాషాయపార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చపార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యం అంటూ చురకలంటించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. అంతేకాదు విశాఖపట్నం లోక్‌సభ నుంచి పురందేశ్వరి పోటీ చేసి ఓటమి పాలైన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘గత లోక్ సభ ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ 20 పోలింగ్ బూత్‌లలో ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదు. మరో 40 పోలింగ్ బూత్‌లలో 10 కంటే తక్కువ ఓట్లే పడ్డాయి. అయినా పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయ్యారు. అందరికీ అలా కలిసి వస్తుందా ఏంటి?’ అంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ అధ్యక్షురాలుగా ఎంపికైన ఆమె టీడీపీ కోసం పనిచేస్తున్నారని ఈ విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.