- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుపైకి రావడంతో ఆ మార్గంలో రాకపోకలకు కాస్త ఇబ్బంది కలిగింది. రంగంలోకి దిగిన సిబ్బంది జేసీబీల ద్వారా బండరాళ్లను తొలగిస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది.
కాగా.. నేడు తిరుపతికి భారీ వర్షసూచన ఉండటంతో.. టీటీడీ ముందుజాగ్రత్త చర్యగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. జేసీబీలు, బుల్డోజర్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచింది. రెండో ఘాట్ రోడ్డులో మొబైల్ స్క్వాడ్ టీమ్స్ ను సిద్ధం చేసింది. ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బందితో టీమ్స్ ను ఏర్పాటు చేసి.. ఘాట్ రోడ్డులలో నిరంతరాయంగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంది టీటీడీ. అక్కడక్కడా విరిగిపడుతున్న మట్టిపెళ్లలను సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వర్షాలు తగ్గేంతవరకూ భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.