మిర్చికి పడిపోయిన ధర.. 10 ఎకరాల పంట తొలగింపు

by srinivas |   ( Updated:2024-10-06 13:09:32.0  )
మిర్చికి పడిపోయిన ధర..  10 ఎకరాల పంట తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతు(Farmer)కు శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో ధర పడిపోయింది. దీంతో 10 ఎకరాల మిర్చి పంటను ఓ రైతు తన చేతులతోనే తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా(Kurnool District)లో జరిగింది.

కోడుమూరు మండలం ప్యాలకుర్తికు చెందిన రైతు షఫి మిరపపంట(Chilli crop)ను సాగు చేశారు. రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి 10 ఎకరాల పంట పండించారు. మూడు కోతల్లో మూడు లక్షల రూపాయలు వచ్చాయి. నాలుగో కోతలో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. ధర ఒక్కసారిగా పడిపోయింది. రూ. 10 వేలు ఖర్చు పెట్టి మిర్చి కోతను మార్కెట్‌కు పంపారు. అయితే రూ. 4 వేలు మాత్రమే వచ్చింది. దీంతో రైతు షఫి ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఎకరాల మిరప పంటను తొలగించారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే మిర్చి పండించే రైతుకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story