Kurnool: శ్రీశైలం దేవాలయం వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2023-11-05 14:24:17.0  )
Kurnool: శ్రీశైలం దేవాలయం వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా శ్రీశైలం దేవాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవాలయానికి చెందిన J,K,L బ్లాకుల మధ్య కొత్త దుకాణాలు నిర్మిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. కొత్త దుకాణాలు నిర్మిస్తే ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ సీసాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవాలయానికి చెందిన J,K,L బ్లాకుల మధ్య కొత్త దుకాణాలు నిర్మిస్తే ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్త దుకాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వ్యాపారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed