- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు గొప్ప ఊరు దిబ్బ.. 15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని కాలనీ
దిశ ప్రతినిధి,కర్నూలు: ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో కొన్ని పల్లెటూర్లు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. కొన్ని పల్లెటూర్లు అలాగే ఉంటున్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పరిధిలో పందిపాడు ఇందిరమ్మ కాలనీ వెలసింది. ఈ కాలానికి పేరు కూడా లేకపోవడంతో పంది పాడు ఇందిరమ్మ కాలనీ అని పిలుస్తున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న పేదలు దైనందిన జీవితంలో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. 2009 వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ కాలనీ పేరిట సుమారు 2500 మంది పేదలకు ఇక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ముజాఫర్ నగర్ సమీపంలో ఈ ఇందిరమ్మ కాలనీ ఉంది. అయితే 15 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని కనీసం మౌలిక వసతులు కల్పించలేదంటున్నారు. నిత్యం నరకం అనుభవిస్తూ పేద ప్రజలు తల్లడిపోతున్నారు.
నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కొందరు పేదల అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ దీపాలు సరిలేక కారు చీకట్లో నగర శివారున అనునిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. రాజకీయ నాయకులు గానీ అధికారులు కానీ తమను పట్టించుకోవట్లేదని తమ సమస్యలు వినట్లు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ప్రతిసారి నాయకులు తమ వద్దకు వచ్చి చేతులు ఎత్తి ఓట్లు అడుగుతున్నారే తప్ప తమ సమస్యలను అయితే మాత్రం నేతలు తమ ఇంటి కాంపౌండ్ లోకి కూడా రానియడం లేదంటున్నారు. విన్నవించుకున్న ప్రతిసారి చూద్దాం.. చేద్దాం.. అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్ని మారిన నాయకులు ఎందరు వచ్చిన అందరికీ వినతి పత్రాలు అందిస్తూ వస్తున్నా.. జిల్లా కలెక్టర్లకు అర్జీలు పెడుతున్న కూడా ఫలితం లేకుండా పోయిన్దంటున్నారు.
కాలనీకి రోడ్డు, తాగు నీరు, డ్రైనేజి సమస్యలు ఎవరికీ కూడా చెవికి ఎక్కడం లేదంటున్నారు. ఈ కాలనీలో అనేకమంది పేదలు పునాదుల వరకు కట్టుకొని ప్రభుత్వ సహకారం లేక ఇంటి నిర్మాణాలు ఆపేసుకున్నారు. అప్పులు చేసి ఇల్లు నిర్మించుకొని నష్టపోయామని చెప్తున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ అందించాల్సిన బిల్లు కూడా సరిగా అందించలేదంటున్నారు. ఇంటి నిర్మాణ విషయంలో ప్రభుత్వం సరైన సహకారం అందించకపోవడంతో ఇల్లు కట్టుకోలేక ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు మొలిచాయి. పాములు, తేలు తిరుగుతున్నాయని భయం భయంగా జీవిస్తున్నామంటున్నారు. పిల్లలు బడికి పంపించిన దానికి చాలా ఇబ్బందిగా ఉందని వర్షాకాలంలో ఆటో, స్కూటర్లు కూడా రోడ్డుపై తిరగలేని పరిస్థితి అంటున్నారు. అదేవిధంగా నగర శివారులో ఉండడంతో ఎలాంటి భద్రత లేక దొంగతనాలు జరుగుతున్నాయంటున్నారు.
ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా సిమెంట్, స్టీల్ తెచ్చుకుంటే వాటిని కూడా ఎత్తుకుపోతున్నారని చెబుతున్నారు. చాలామంది సాయంత్రం అయితేనే అక్కడ తాగడానికి వస్తారని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని అంటున్నారు. మున్సిపల్, రెవిన్యూ, విద్యుత్ అధికారులు స్పందించి కనీసం రోడ్ పక్కన వెలసిన ముళ్ళకంపలు తొలగిస్తే బాగుంటుంది అంటున్నారు పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలకులు ఎందరోచ్చిన పేదోడి తలరాత మాత్రం మార్చలేదని వాపోతున్నారు.విద్యుత్ స్తంభాల అలంకారప్రాయంగా ఉన్నాయని కనీసం ఇళ్ల వద్ద కూడా లైట్లు లేవని చెప్తా ఉన్నారు. కరెంట్ స్తంభాలకు లైట్లు వేసుకోవడానికి లైన్ మెన్ కి మూడు నాలుగు వందల ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలనీ కీ పేరు పెట్టి మౌలిక వసతిలు కల్పించి పేదలకు ఇల్లు కట్టుకునే సౌలభ్యం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే పోలీసులు వారానికి రెండు సార్లు తమ కాలనీ వైపు వసుండాలని చెబుతున్నారు. పేదలను ఆర్థికంగా బలపరచడం ద్యేయం అంటున్న పాలక ప్రభుత్వం ఏ మేరకు పేదలకు అండగా నిలుస్తుందో వేచి చూడాలి మరి.