Srisailam: జలాశయం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

by srinivas |
Srisailam: జలాశయం వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. శ్రీశైలం నుంచి ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. జలాశయం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి ఇచ్చే క్రమంలో బస్సు రోడ్డు పక్కనున్న గుంతలో ఇరుక్కుపోయింది. అంతేకాదు రోడ్డుకు అడ్డంగా బస్సు ఆగడంతో బస్సులోని ప్రయాణికులు భయంతో బయట దిగారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుకు అడ్డంగా బస్సు నిలిచిపోవడంతో వచ్చి వెళ్లే వాహనాలు జలాశయం వద్ద సుమారు 2 కిలోమీటర్లు నిలిచిపోయాయి. దీంతో తోటి ప్రయాణికులు పక్కనే ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను బస్సు టైర్ కిందకి పెట్టి బస్సును బయటకు తీశారు. తరచూ జలాశయం మూల మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story