Olympic Day: కర్నూలులో అంబరాన్నంటిన క్రీడా సంబరాలు

by srinivas |
Olympic Day: కర్నూలులో అంబరాన్నంటిన క్రీడా సంబరాలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఒలింపిక్ దినోత్సవాన్ని పురష్కరించుకుని కర్నూలులో నిర్వహించిన క్రీడా సంబరాలు అంబరాన్నంటాయి. హాకీ, సెపక్ తక్రా, ఉషు, ఈత పోటీలు నిర్వహించారు. ఈత, సెపక్ తక్రా, ఉషు పోటీలను ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ప్రారంభించగా, హాకీ పోటీలను న్యాయవాది జయరాజు, కరాటేను మౌర్య ఇన్ కాంప్లెక్స్ మేనేజర్, టీడీపీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల దేహదారుడ్యంతో పాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. చిన్న తనం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఈత అసోసియేషన్ కార్యదర్శి నరసింహులు, విశ్రాంత శిక్షకులు నటరాజ్, ఒలంపిక్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, అవినాష్, సునీల్ కుమార్, కరాటే శిక్షకులు ఆరిఫ్, సతీష్, బిల్డర్ ఆనంద రెడ్డి, యునైటెడ్ ఇన్సూరెన్స్ మేనేజర్ వినీత్ కుమార్, హాకీ సంఘ ప్రతినిధులు రసూల్, ద్వారకానాథ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed