- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Telangana Border: నదిలో నరకం.. ఆందోళనలో శివభక్తులు
దిశ, కర్నూలు ప్రతినిధి : ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని సిద్దేశ్వరం-సోమశిల ప్రాంతాల్లో నెలకొన్న ఘాట్ బోట్ల పంచాయితీ శివ స్వాములపై తీవ్ర ప్రభావం చూపింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్, పెంట్లవెళ్లి, పాన్ గల్, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలకు చెందిన శివ స్వాములు, భక్తులు సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుని కాలినడకన శ్రీశైలం వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్లు గానే వారంతా సోమశిల చేరుకున్నారు.
నెల క్రితం నిషేధం
కాగా నెల క్రితం నుంచి కృష్ణానదిపై ఘాట్ బోట్ల రవాణను జిల్లా అధికారులు నిషేధించారు. అప్పటి నుంచి నేటి వరకు నదిలో ఎలాంటి బోట్లు తిరగడంలేదు. తెలంగాణకు చెందిన ఘాట్ బోట్ల నిర్వాహకులు మాత్రం అక్కడి అధికారులు, రాజకీయ నాయకుల పలుకుబడితో వారి సరిహద్దుతో పాటు సంగమేశ్వరం, మల్లేశ్వరం, సోమశిల, ఇటు ముచ్చుమర్రికి మధ్యన ఉన్న మినీ ఐ ల్యాండ్‌కు పర్యాటకులను చేరవేసేవారు. ఈ విషయం తెలియని శివస్వాములు బోటు దాటేందుకు వచ్చారు. కానీ ఘాట్ బోట్ నిర్వాహకులు శివ స్వాములు, పర్యాటకులు, భక్తులను బోట్లలో ఎక్కించుకుని మినీ ఐ ల్యాండ్ చూపించి అక్కడే వదిలారు. సంగమేశ్వరం గానీ, సిద్దేశ్వరం గానీ వెళ్లేందుకు తమకు అనుమతి లేదని, అక్కడి వారు వచ్చి తీసుకెళ్తారని చెప్పడంతో శివస్వాములు, భక్తులు, పర్యాటకులు నోరెళ్లబెట్టారు. చేసేదిలేక మళ్లీ బోట్ల ద్వారా సోమశిలకు వెళ్లిపోయారు.
ఏర్పాట్లు చేయని అధికారులు
అయితే నెల రోజుల క్రితం నుంచి ఘాట్ బోట్ల రాకపోకలను నిషేధించినా ఏపీకి చెందిన నంద్యాల జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపలేదు. దీంతో నెల రోజులుగా భక్తులతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు, భక్తులు, పర్యాటకులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అందువల్ల అధికారులు స్పందించి ఘాట్ బోట్ల నిర్వహణపై చర్యలు తీసుకొని ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆయా రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు.