- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవినాశ్‌రెడ్డిని దోషిగా చిత్రీకరిస్తున్నారు.. అన్యాయం: K.A. Paul
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి న్యాయం జరగాలని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ ప్రార్థించారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన ఆయన అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ వైఎస్ విమలా దేవి వీడియో తన హార్ట్‌కు టచ్ అయిందని, అందుకే అవినాశ్ రెడ్డి తల్లిని చూసేందుకు వచ్చానని తెలిపారు. వివేకాహత్య కేసులో అవినాశ్ రెడ్డి నిర్దోషని, అన్యాయంగా దోషిగా చిత్రీకరిస్తున్నారన్నారు. వివేకానందారెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలని తాను ముక్కు సూటిగా అవినాశ్ రెడ్డికే చెప్పినట్లు కేఏ పాల్ తెలిపారు.
కాగా అస్వస్థతతో అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి కర్పూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం వరకూ ఐసీయూలో చికిత్స పొందిన ఆమెను సాధారణ వార్డుకు మార్చారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువర్గ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా కూడా వాదోపవాదనలు జరిగాయి. దీంతో ఈ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి: Viveka Case: వైఎస్ సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్