- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి భరత్..
దిశ ప్రతినిధి,కర్నూలు:రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ లోని సమస్యలను అంచల వారీగా ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కర్నూలు-1 డిపో గ్యారేజీలో 4 కొత్త బస్సులను పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ జెండా ఊపి ప్రారంభించి అనంతరం బస్సు నడిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యలను అంచల వారీగా ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కర్నూలు, ఎమ్మిగనూరు నుంచి హైదరాబాద్, ఆదోని నుంచి కర్నూలు, కర్నూలు నుంచి శ్రీశైలంకు 4 బస్సులు, గత నెలలో ఆరు బస్సులను మొత్తం 10 బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
కర్నూలు జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం రద్దీగా ప్రయాణించే రోడ్లలో ప్రణాళిక బద్ధంగా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మంత్రి అన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందుగా అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. కర్నూలు బస్టాండ్‌లో ప్రజల సౌకర్యాలను ఇంకా అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్టీసీని ప్రణాళిక బద్ధంగా అంచల వారీగా అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత నెలలో 6 బస్సులు ఇప్పుడు 4 బస్సులు మొత్తం పది బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని ఇకనుంచి ఆర్టీసీని ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, కర్నూలు-1 డిపో మేనేజర్ సుధారాణి, కర్నూలు-2 డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.