- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంచార్జి మార్పు ఎఫెక్ట్.. వైసీపీ ఎమ్మెల్యే కుటుంబంలో చిచ్చు
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంచార్జులను మార్పు చేస్తున్నారు. సిట్టింగులు ఉన్నప్పటికీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమిస్తున్నారు. దీంతో ఓ చోట్ల వైసీపీలో అలజడి రేగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబంలోనూ చిచ్చు రేపింది. ఎమ్మిగనూరులో అచ్చం ఇదే జరిగింది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నారు. అయితే వయసు రీత్యా ఆయనకు బదులుగా మరొకరిని ఈ నియోజకవర్గం ఇంచార్జిని మార్చేందుకు వైసీపీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు మాజీ ఎంపీ బుట్టా రేణుక, లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రగౌడ్ పేర్లను పరిశీలించారు. బుట్టా రేణుకను దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది.
అయితే వైసీపీ అధిష్టానాన్ని కలిసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసీపీ నేత మాచాని వెంకటేశ్వర్లు పేరును ప్రతిపాదించారు. దీంతో వెంకటేశ్వర్లునే ఎమ్మిగనూరు ఇంచార్జిగా నియమించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డిపై నియోజకవర్గం వైసీపీ నేతలతో పాటు ఆయన తనయుడు కూడా గుర్రుగా ఉన్నారు. ఎమ్మిగనూరులో పోటీ చేసేందుకు చెన్నకేశవరెడ్డి తనయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో తన తండ్రి వేరే వ్యక్తి పేరు ప్రతిపాదించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన తండ్రికి లేదా తనను ఇంచార్జిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాచాని వెంకటేశ్వర్లును ఎమ్మిగనూరు ఇంచార్జిగా నియమిస్తే సహకరించేదిలేదని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గీయులు హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఎమ్మిగనూరు వైసీపీలో, ఎమ్మెల్యే కుటుంబంలో అసంతృప్తిని రగిల్చింది.