- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ మాట్లాడుతుండగా పవర్ కట్.. మార్పు బాగుందంటూ సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారంలో ముందడగులు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో.. అత్యధిక స్థానాల్లో గెలిచి పెంచుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా పవర్ కట్ అయింది. దీంతో కాసేపు ఆగి కావాలనే తీశారా.. లేక నిజంగానే పవర్ కట్ అయిందా అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న నేతలు పవర్ కట్ అయిందని, రోజు పోతుందని కేటీఆర్‌తో చెప్పుకొచ్చారు. దీంతో కేటీఆర్.. నవ్వూతూ.. మార్పు బాగుందా.. అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. దీంతో అక్కడున్న వారంతా.. ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టారు.
ఇదే సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే పరిస్థితులు వేరేలా ఉండేవని..చెప్పుకొచ్చారు. అలాగే మన కర్మ కొద్ది రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని.. ఎద్దేవ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని,.. తెలంగాణ అధికార గీతం రాజముద్ర లో ఏముందో కూడా తెలియని మంత్రులు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
Read More..