Sangameshwara Temple:సంగమేశ్వర ఆలయాన్ని తాకిన కృష్ణమ్మ..చీర సారె సమర్పించి, మంగళ హారతి

by Jakkula Mamatha |
Sangameshwara Temple:సంగమేశ్వర ఆలయాన్ని తాకిన కృష్ణమ్మ..చీర సారె సమర్పించి, మంగళ హారతి
X

దిశ, నందికొట్కూరు:కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్‌కు భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటిమట్టం చేరింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి వరద నీరు చేరింది. అలాగే కొత్తపల్లి మండలంలోని సప్త నదుల సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేప దారు శివలింగానికి కృష్ణమ్మ తాకింది. సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టడంతో ఆలయం బయట వేప దార లింగానికి పురోహితులు పూజలు చేశారు. ఈ సంవత్సరంలో చివరిసారిగా వేప దారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘు రామ శర్మ తెలిపారు.

కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వర ఆలయం..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం దగ్గరకు నీరు చేరుకున్నది. కృష్ణా నదికి చీర సారె సమర్పించి, మంగళ హారతి ఇచ్చారు. గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ఆలయ పురోహితులు పూజలు నిర్వహించారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం ఎనిమిది నెలలు ఆగాల్సిందే. వరద నీటిలో మునిగిన తర్వాత సంగమ తీరం ఒక సముద్రాన్ని తలపిస్తుంది. మరో రెండు రోజుల్లో కృష్టమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. వరద ప్రభావం ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని చెబుతున్నారు ఆలయ పూజారి తెలకపల్లి రఘు రామ శర్మ.

ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఇదే..

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం లో తుంగభద్ర, కృష్ణ, వేణి, భీమా, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

1980లో నీట మునిగిన ఆలయం..

శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత 1980లో సప్తనదీ సంగమేశ్వర కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది. అప్పటి నుంచి 24 సంవత్సరాల పాటు జలాధివాసం ఆయన సంగమేశ్వరం 2000లో బయట పడి భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఎనిమిది నెలలు జలాధివాసం లోనే ఉంటాడు.18 సంవత్సరాలలో మహా శివరాత్రి పర్వదినానికి 12 సార్లు భక్తులకు దర్శనమివ్వడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed