- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kodali Nani: ఎమ్మెల్సీగా ఇదే ఆఖరు రోజు.. లోకేశ్‌పై సెటైర్స్
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ దేవుడి లాంటి ఎన్టీఆర్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచావ్ అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే... చంద్రబాబు, లోకేశ్ పదవి పోయిందని ఏడుస్తున్నారని ఆరోపించారు. లోకేశ్‌కు ఎమ్మెల్సీగా ఇదే ఆఖరి రోజు అని, అదే దేవుడు, ఎన్టీఆర్ రాసిన స్క్రిప్టు అని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు అంటే వెన్నుపోటు గుర్తొస్తుంది. ఎన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి వైఎస్సార్’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అవసరమైతే ఎన్టీఆర్‌ను దేవుడని అంటారని.. లేకపోతే రాక్షసుడు అని అంటారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: Ap News: ప్రస్తుత రాజకీయాలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు