- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఆడవాళ్లను కించపరిస్తే కఠిన చర్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలపై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. విజయవాడలో బుధవారం సోషల్ మీడియా - మహిళలపై దాడి అంశంపై మహిళా కమిషన్ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడి గురించి చర్చించారు. సోషల్ మీడియాలో సీఎం కుటుంబ సభ్యులు మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా దారుణంగా పోస్టులు పెడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. సోషల్ మీడియాలోకి మహిళలు అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై వేలెత్తి చూపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. మహిళల పట్ల ఇలాగే సోషల్ మీడియాలో వ్యవహరిస్తామని అంటే రోడ్డుపై తన్నులు తినే రోజులు వస్తాయని హెచ్చరించారు. మహిళలు కూడా సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని హితవు పలికారు. అవసరం అయితే చట్టాలు, శిక్షలు మార్చాలన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిని వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సెమినార్ నిర్వహించినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ సదస్సులో ఎవరి గొంతు నొక్కటం లేదని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రకటనలతో, విమర్శలతో సంబంధం లేకుండా మాట్లాడితే అందరికీ స్వాగతం పలుకుతామని అన్నారు. మరోవైపు శుక్రవారం గౌరవ దినంగా పాటించాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు.