- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్నవరంలో ఉద్రిక్తత.. కడప టీడీపీ అభ్యర్థి మాధవిపై దౌర్జన్యం
దిశ, వెబ్ డెస్క్: గన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ వర్క్ షాప్‌లో పాల్గొనేందుకు ఆమె విజయవాడ వెళ్లారు. అయితే ఎక్కడ చూసినా వైసీపీ పోస్టర్లే కనిపించాయి. దీంతో వాటిని ఫోటోలు తీసి సీ విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే మాధవి ఫోటోలు తీయడం చూసి వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. పోలీసులు కూడా ఆమెతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలియడంతో గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వెంటనే అక్కడకు వెళ్లారు. వైసీపీ నాయకుల చర్యలను ఆయన ఖండించారు. ఎన్నికల నిబంధనలను వైసీపీ నాయకులు యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలన ముగింపునకు సమయం దగ్గరపడిందని యార్లగడ్డ జోస్యం చెప్పారు.
Read More..
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. కొందరు ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు