YSRCP వర్సెస్ Janasena.. అవనిగడ్డలో ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2023-10-20 12:07:59.0  )
YSRCP వర్సెస్ Janasena.. అవనిగడ్డలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు ఇంటి ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే రమేశ్ బాబు ఆగ్రహం వ్యకం చేశారు. జనసేన కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed