Ap News: మాజీ మంత్రి దేవినేని ఉమపై పరువు నష్టం దావా..!

by srinivas |   ( Updated:2023-11-28 12:39:44.0  )
Ap News: మాజీ మంత్రి దేవినేని ఉమపై పరువు నష్టం దావా..!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి దేవినేని ఉమహేశ్వరరావుకు పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తానని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం చెవుటూరు సొసైటీ భవన ప్రారంభోత్సవం పాల్గొన్న ఆయన.. టీడీపీ నేత అన్నా (గన్నే ప్రసాద్)‌ను రౌడీ షీటర్ అన్న మాటలను వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు గన్నే ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పారు. కానీ దేవినేని ఉమకు మాత్రం నోటీసులు పంపుతానని హెచ్చరించారు.


కాగా నాలుగు రోజుల క్రితం టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో బూడిద చెరువు సందర్శన చేపట్టారు. అయితే ఈ సందర్శన తర్వాత తిరిగి వస్తున్న తనపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దాడి చేయించారని దేవినేని ఉమ ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో సహజ సంపద, బూడిదను వసంత కృష్ణప్రసాద్, ఆయన బావ మరిది కోటేశ్వరరావు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వసంత కృష్ణ ప్రసాద్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తనపై చేసిన వ్యాఖ్యలకు దేవినేని ఉమ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా నోటీసులు ఇస్తామని కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed