Ap News: లాయర్లకు సీఐడీ నోటీసులు.. జైభీమ్ భారత్ పార్టీ ఆగ్రహం

by srinivas |
Ap News: లాయర్లకు సీఐడీ నోటీసులు.. జైభీమ్ భారత్ పార్టీ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేంత తప్పు న్యాయవాదులు ఏం చేశారని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ నిలదీశారు. మార్గదర్శి కేసులో పలువురు న్యాయవాదులకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జైభీమ్ భారత్ పార్టీ న్యాయవిభాగం ఆధ్వర్యంలో శనివారం సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్‌, హోంశాఖమంత్రి, డీజీపీలు చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. దర్యాప్తు పేరుతో తమను వేధించి ఆనందం పొందాలని చూడాలనుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలు నిరసన తెలపకుండా ఉండేందుకు జీవో 1 తెచ్చారని..తాజాగా న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తే సంకెళ్లు వేసేలా నోటీసులు ఇవ్వడం ఏంటని జడ శ్రావణ్ కుమార్ నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed