Kondali Nani: ఆ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి కోటి నుంచి 30 కోట్లు..!

by srinivas |   ( Updated:2023-09-04 10:32:09.0  )
Kondali Nani: ఆ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి కోటి నుంచి 30 కోట్లు..!
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని.. ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా కొడాలి నాని సైతం చంద్రబాబుపై విమర్శల దాడి పెంచారు. చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. చంద్రబాబుకు సింగపూర్‌లో హోటళ్లు ఉన్నాయని.. అవి ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చట్టాలను అడ్డంపెట్టుకుని టీడీపీ హయాంలో చంద్రబాబు దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు.


ఎన్నికల్లో డబ్బు పంపిణీ నేర్పిందే చంద్రబాబు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 1999లోనే ఒక్కో అభ్యర్థికి రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలల్లో 5 నుంచి రూ. 30 కోట్ల వరకూ ఇచ్చి టీడీపీ అభ్యర్థుల తరపున ఓట్లు కొనుగోలు చేశారన్నారు. అలా దాదాపు రూ.10 వేల కోట్ల వరకూ టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చారని కొడాలి నాని చెప్పారు. 2014 ఎన్నికల్లో జగన్ డబ్బులు పంచి ఉంటే అప్పుడే సీఎం అయ్యే వారని వ్యాఖ్యానించారు. జగన్ 2014లో ఓడిపోయారని, ఆ తర్వాత ఎవరినైనా కలిశారా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే గెలిచి అధికారంలోకి రాలేదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు ఈసారి కూడా తప్పించుకోలేరని కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story