AP Professional Forum: ఏపీకి పెట్టుబడులు వచ్చే స్థితి ఉందా!

by srinivas |
AP Professional Forum: ఏపీకి పెట్టుబడులు వచ్చే స్థితి ఉందా!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ నాయకుల కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయని.. వాళ్లను నమ్మి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని ఏపీ ప్రొఫెషనల్​ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్​క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ విభజిత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించేలా పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. దీనికి భిన్నంగా పరిస్థితులున్నాయని, కంపెనీలు రావడానికి భయపడే వాతావరణాన్ని సృష్టించారని ఆయన విమర్శించారు. కక్షతో నిండిన రాజకీయాలతో పారిశ్రామిక వేత్తలను కులం కోణంలో చూస్తుంటే పెట్టుబడులు వస్తాయా అని నిలదీశారు. అమరావతి రాజధానికి వచ్చిన సంస్థలు మూడు రాజధానుల ప్రకటనతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. పరిశ్రమాధిపతుల్ని ఎంపీలు, ప్రజాప్రతినిధులు బెదిరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. రూ.2.4 లక్షల కోట్ల బడ్జెట్‌లో పారిశ్రామిక వృద్ధికి కనీసం రెండు వేల కోట్లు కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. అలాంటిది పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ఏం ప్రోత్సాహకాలు ఇస్తుందని మహేశ్వరరావు ప్రశ్నించారు.

‘రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించలేక చతికిలపడుతోంది. ఆర్థిక దివాళా అంచున చేరిన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా..? అంటూ నిలదీశారు. ఇకనైనా ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంచే రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారి విశ్వాసాన్ని చూరగొనే విధంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed