- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
దిశ, వెబ్ డెస్క్: గుడివాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు సోహెల్, సాయి, హర్షగా గుర్తించారు. గుడివాడ బస్టాండ్ సెంటర్‌లో బైక్ పై వెళ్తుండగా యువకులను బస్సు ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు యువకులు గుడివాడ ముబారక్ సెంటర్, కాకర్లవీధికి చెందిన స్నేహితులు. సరదాగా బైక్ పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక ఢీకొట్డంతో మృతి చెందారు. ఆర్టీసీ బస్సు అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో యువకుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారిని ఆపడం ఎంవరితరం కావడంలేదు. ఎంతో ఉత్సహాంగా కనిపించే యువకులు ఇక లేరని తెలిసి అటు స్థానికులు సైతం కంటతడి పెట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.