13 గంటల ఆపరేషన్.. 80 మంది సిబ్బంది.. ఒక్క ప్రాణ నష్టం జరగకుండా సక్సెస్

by Anjali |
13 గంటల ఆపరేషన్.. 80 మంది సిబ్బంది.. ఒక్క ప్రాణ నష్టం జరగకుండా సక్సెస్
X

దిశ, వెబ్‌డెస్క్: నూజివీడు దగ్గర పెద్ద చెరువుకు భారీగా గండి పడింది. దీంతో ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి, ఊహించని విధంగా వచ్చిన వరదల్లో పలు గ్రామాల ప్రజలు చిక్కుకున్నారు. సమాచారం రావటంతో వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం, NDRF, SDRF, ఫైర్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ కిషోర్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మంత్రి పార్ధసారధి పలు మార్లు ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు. ప్రభుత్వం, అధికారులు సకాలంలో స్పందించటంతో ప్రాణ నష్టం జరగకుండా, అందరినీ కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు. 13 గంటల సేపు ఆపరేషన్ కొనసాగింది. నూజివీడు ప్రజల్ని సేవ్ చేయడానికి 80 మంది సిబ్బంది కష్టపడ్డారు. చివరకు వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. మరీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు రేపటికల్లా తగ్గుతాయా? లేదా? అనేది చూడాలి. వాతావరణ శాఖ ప్రకటించిన ప్రకారమైతే రేపు వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed