- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Heavy Rains:కొండవాగులా బీభత్సం..ఏలూరు ఏజెన్సీలో పలు గ్రామాలు జలమయం
దిశ,ఏలూరు:ఏలూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల కొంప ముంచుతున్నాయి. కొండవాగులా ఉధృతికి తోడు గోదావరి వరద కూడా పెరుగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని కొవ్వాడ, జల్లేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు వరద నీటితో ఉరకలేస్తున్నాయి. వీటికి తోడు చిన్న చిన్న వాగులు వంకలు కూడా పొంగుతున్నాయి. ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో పల్లపు ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగాయి. మెట్ట ప్రాంతంలోని తమ్మిలేరు రిజర్వాయర్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువ నుండి వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో ఏలూరు తంగెళ్ళమూడి వంతెన వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరి వరద ప్రవాహాన్ని చూస్తున్నారు. దీంతో ఏలూరు రెండవ పట్టణ సీఐ.ప్రభాకర్, ఎస్సై సాదిక్, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం మేరకు తమ్మిలేరు రిజర్వాయర్‌కు 5,560క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుండి వస్తోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచి 6,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మరోవైపు ఏజెన్సీలోని పోలవరం మండలంలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది.
భారీ వర్షాలకు కొండవాగులు, కొవ్వాడ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లండీపేట కొవ్వాడ రిజర్వాయర్‌లో గురువారం ఉదయం నీటిమట్టం 90.25 మీటర్లకు చేరడంతో వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోలవరం నుండి కన్నాపురం వెళ్లే రోడ్డు మార్గంలో దొండపూడి సాగిపాడు కల్వర్టు పై కొవ్వాడ నీటితో కొండవాగులా వరద కలిసి 4 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద నీటితో పాటు గుంజ వరం కాలువ నీరు కూడా కలిసి పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిజ్ గేట్ల నుంచి గోదావరిలోకి ప్రవహిస్తోంది. పోలవరం నుంచి గుంజ వరం మీదుగా రేపల్లె వాడ వెళ్ళే మార్గంలో గుంజవరం వద్ద ఉన్న కల్వర్టు, చేగొండపల్లి రేపల్లెవాడ కల్వర్టులపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది.
పోలవరంలో ఒక్కరోజులో 115.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు పోలవరం పట్టిసీమ, గూటాల, కొత్త పట్టిసీమ, ఇటుకలకోట, వింజరం, చేగొండపల్లి పంచాయతీలలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం గురువారం నాటికి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 7,43,222 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ఎగువన 31.430 మీటర్లు, స్పిల్ వే దిగువన 22,790 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం వద్ద వున్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయి. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.30 మీటర్లుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 6000 క్యూసెక్కుల నీరు చేరుతుంది. ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ద్వారా 6, 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.