సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు

by Shiva |
సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాస్పద దర్శకుడు ‌రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన మరోసారి సీఐడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ నెల 3న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి ఇవాళ మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విచారణ సంస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో కోర్టు ఎన్నిసార్లు పిలిచినా అర్థం లేని కారణాలతో సీఎం జగన్‌రెడ్డి అక్కడికి వెళ్లడమే మానేసి.. వాయిదాల మీదా వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు. జగన్‌‌కు ఏ మాత్రం భారత చట్టాల మీద గౌరవం ఉన్నా.. తన కేసులపై విచారణకు హాజరవ్వాలని కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ విసిరారు.

Advertisement

Next Story