CM జగన్‌కు బిగ్ షాక్.. ఎన్నికల వేళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోడికత్తి శ్రీనివాస్

by GSrikanth |   ( Updated:2024-04-28 12:44:42.0  )
CM జగన్‌కు బిగ్ షాక్.. ఎన్నికల వేళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోడికత్తి శ్రీనివాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిత్యం ఫాలో అయ్యేవారికి కోడికత్తి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2019 ఎన్నికల సమయంలో ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌పై కోడికత్తితో దాడి చేసి తెలుగు రాష్ట్రాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. తాజాగా ఎన్నికల వేళ శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంతో సహా టీడీపీలో చేరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో పలు కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.


ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని పార్టీల మద్దతు లభించినా తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని అన్నారు. తాను బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలేనని అన్నారు.

Advertisement

Next Story