- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని పాజిటివ్ కామెంట్స్.. జనసైనికులకు కీలక విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన కూటమిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ సభలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్కటే వస్తే గెలవలేడని.. ఎన్నికల్లో తోడుగా దత్తపుత్రుడిని తెచ్చుకుంటున్నారు అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తన వర్గానికి 30 సీట్లు ఇచ్చుకున్నారు.. 20 శాతం సామాజికవర్గం ఉన్న పవన్ కల్యాణ్‌కు కేవలం 24 సీట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అని.. ఇదే మరోసారి నిరూపితమైందని అన్నారు.
ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కల్యాణ్ ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబే ఓడిస్తారని.. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు. అంతకుముందు పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని పాజిటివ్ కామెంట్స్ చేశారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు నాని ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని.. ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు. పవన్ కల్యాణ్‌ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసేనికులు.. అభిమానులకు ఉందన్నారు. చంద్రబాబు ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరన్నారు.
Also Read..
ఎమ్మెల్యే అక్రమాలపై పల్నాడు లో చర్చ..ఉతికి ఆరేసిన చంద్రబాబు?