- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
BJP: కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక ఎన్నికల ప్రచార బాధ్యతలు!
దిశ, వెబ్ డెస్క్: మే 10న కర్ణాటకలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ అధిష్టానం ఆ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికార పీఠంపై ఉన్న బీజేపీ మరోసారి కూడా పాగా వేయాలని చూస్తోంది. ఎలాగైనా సరే సిట్టింగ్‌ను నిలబెట్టుకునేందుకు వ్యూహ రచనలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.
అయితే కర్ణాటకలో చాలా చోట్ల తెలుగు వారి ప్రభావం ఉంది. బెంగళూరు సిటీతో పాటు చాలా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు నిర్ణయించే ఓటు బ్యాంకింగ్ ఉంది. దీంతో వారిని ఆకట్టుకునేందుకు తెలుగు రాజకీయ నేతలతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే కాషాయం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక ఎన్నికల ప్రచారం బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సేవలు అందించేందుకు ఆయనకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే కేంద్రహోంమంత్రి అమిత్ షా నేపథ్యంలో జరిగిన సమావేశానికి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికలపై చర్చించినట్లు సమచారం. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేస్తారని తెలుస్తోంది.