ప్రేమజంటను విడదీసి..యువతి కిడ్నాప్: వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి అరెస్టు

by Seetharam |
ప్రేమజంటను విడదీసి..యువతి కిడ్నాప్: వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి అరెస్టు
X

దిశ,కడప: ప్రేమికుల జంటను విడ దీసి కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో మాజీమంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్లలోని ఎస్సి అబ్బాయి, నూర్ బాషా కులానికి చెందిన అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అప్రూవర్ దస్తగిరిది,అమ్మాయి ది,ఒకే కులం కావడంతో ఆ కులస్తులు దస్తగిరిని సంప్రదించారు. మా అమ్మాయిని ఎస్సీ అబ్బాయి ప్రేమిస్తున్నాడని చెప్పడంతో, దస్తగిరి వారిద్దరినీ పిలిపించి ఎస్సి అబ్బాయిని కులం పేరుతో దూషించి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంతో ఆ ఎస్సి అబ్బాయి పోలీసులను ఆశ్రయించారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎర్రగుంట్ల పోలీసులు జమ్మలమడుగు డిఎస్పి నాగరాజు ఆధ్వర్యంలో దస్తగిరిని పులివెందులలో అరెస్ట్ చేసి ఎర్రగుంట్ల స్టేషన్ కు తరలించారు. దస్తగిరిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story